మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 16:01:36

ఇన్‌స్టాగ్రామ్‌లో పాదాల వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు!

ఇన్‌స్టాగ్రామ్‌లో పాదాల వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు!

వాషింగ్టన్‌: ప్రతిఒక్కరూ వృత్తిపరమైన పనితోపాటు అదనపు సంపాదన కోసం వేరే పనిచేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రత్నామ్యాయ పనే సంతృప్తిగా ఉండడంతో అసలు ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పనికోసం చాలామంది సోషల్‌మీడియాను ఎంచుకుంటున్నారు. ఈ కోవకు చెందినవాడే యూఎస్‌ఏలోని అరిజోనాకు చెందిన జాసన్ స్ట్రోమ్‌. 35 ఏళ్ల వయస్సున్న అతడు తన పాదాల ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టా వేదికగా అమ్ముతూ నెలకు రూ. 2.9 లక్షలు సంపాదిస్తున్నాడు. 

స్ట్రోమ్‌ ఇంతకుముందు వెబ్‌క్యామర్‌గా పనిచేసేవాడు. తన క్లయింట్లలో ఒకరు ఒకసారి కేవలం తన పాదాలను మాత్రమే చూపాలని కోరాడట. దీంతో అప్పుడే స్ట్రోమ్‌కు ఓ ఆలోచన తట్టింది. తన పాదాల ఫొటోలను అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కేవలం తన పాదాలను చూపించేందుకే ఓ ఇన్‌స్టా పేజీ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడా పేజీకి 5,000 మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తరువాత, డబ్బు సంపాదించడానికి జాసన్ ఓన్లీఫాన్స్ వైపు మొగ్గు చూపాడు. ఇప్పుడు అతని కంటెంట్‌ ప్రామాణిక సభ్యత్వం ధర నెలకు  7.99 డాలర్లు. క్లయింట్‌ ఈ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉంటేనే అతడు వీడియో పెడతాడు. దీంతో అతడు ప్రతినెలా చివరలో రూ.2.9 లక్షలు సంపాదిస్తున్నాడు. తన పాదాలను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారని, ఆర్థికంగా తనను తన పాదాలే ఆదుకుంటున్నాయని అంటున్నాడు స్ట్రోమ్‌.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo