శనివారం 30 మే 2020
International - May 16, 2020 , 12:45:00

సింగిల్‌గా ఉన్నారా.. ఇవీ శృంగార స‌ల‌హాలు !

సింగిల్‌గా ఉన్నారా.. ఇవీ శృంగార స‌ల‌హాలు !

హైద‌రాబాద్‌: సింగిల్‌గా ఉన్నారా ?  ఎవ‌రితోనైనా శృంగారంలో పాల్గొనాల‌నుకుంటున్నారా ? అయితే మీకో స‌ల‌హా.  లాక్‌డౌన్ వ‌ల్ల‌ ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా సోష‌ల్ డిస్టాన్సింగ్ సూత్రాలు పాటిస్తున్న విష‌యం తెలిసిందే. వైర‌స్ వేళ క‌చ్చితంగా ఇద్ద‌రి మ‌ధ్య రెండు మీట‌ర్ల దూరం ఉండాల్సిందే. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో శృంగారం ఎలా సాధ్యం ? దీనిపై డ‌చ్ ప్ర‌భుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. సింగిల్‌గా ఉన్న వాళ్లకు ఓ ఘాటైన స‌ల‌హా ప్ర‌జెంట్ చేసింది.  రెగ్యుల‌ర్ పార్ట్న‌ర్‌తో సెక్స్ సాధ్య‌మే అన్న అభిప్రాయాన్ని కూడా డ‌చ్‌కు చెందిన ప‌బ్లిక్ హెల్త్ శాఖ పేర్కొన్న‌ది.  ఆ ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ  త‌మ ప్ర‌జ‌ల‌కు చెప్పిన కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిద్దాం. 

ఒక‌వేళ భాగ‌స్వామికి అనుమానిత క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే, వారితో సంభోగం చేయ‌వ‌ద్దు అంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశం జారీ చేసింది. ఇక సింగిల్‌గా ఉన్న‌వారు ఎలా శారీర‌క వాంఛ‌ను తీర్చుకోవాలో చిట్కాలు కొన్నిచ్చింది. ఒంట‌రిగా ఉన్న‌వారికి ఎవ‌రైనా రెగ్యుల‌ర్ పార్ట్న‌ర్ ఉంటే వారిని క‌లుసుకోవ‌చ్చు అన్న స‌ల‌హా ఇచ్చింది. అయితే వైర‌స్ రిస్క్‌ను మ‌రింత త‌గ్గించే ఉపాయాన్ని కూడా ప్ర‌భుత్వం ఇచ్చింది. ఒక‌వేళ ఎక్కువ మందిని క‌లిసే అలవాటు ఉన్న‌వారు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎందుకంటే వైర‌స్ వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. 

 వాస్త‌వానికి శృంగార కోర్కెల‌ను అదుపులో పెట్టుకోవ‌డం అంత సులువైన ప‌నికాదు. కానీ డ‌చ్ ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌ ప్ర‌జ‌లంద‌రికీ ఓ మేటి స‌ల‌హా ఇచ్చింది. సామాజిక దూరం పాటిస్తూనే త‌మ‌తో తాము కానీ ఇత‌రుల‌తో కానీ సెక్స్ చేయ‌వ‌చ్చు అన్న ఐడియాను ప్ర‌జెంట్ చేసింది. ఒక‌వేళ మీకు భాగ‌స్వామి ఉంటే, వారితో శృంగారప‌ర‌మైన క‌థ‌లు, ముచ్చ‌ట్లు పెట్టాల‌న్న‌ది. అలా కాని ప‌క్షంలో ఇద్ద‌రూ హ‌స్త‌ప్ర‌యోగం చేసుకోవ‌చ్చు అన్న సూచ‌న చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు నెద‌ర్లాండ్స్‌లో 5662 మంది క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణించారు. దాదాపు 43,88 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. ఆ దేశంలో ఇప్ప‌టికే కొన్ని లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు.


 


logo