సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 19, 2020 , 18:27:03

ఇవి క్వీన్ ఎలిజ‌బెత్‌కు మాత్ర‌మే సాధ్యం!

ఇవి క్వీన్ ఎలిజ‌బెత్‌కు మాత్ర‌మే సాధ్యం!

లండ‌న్‌: ఈ వార్త చదివిన త‌ర్వాత మీరు క్వీనా మ‌జాకా అని అన‌కుండా ఉండ‌లేరు. రాణి అంటే రాణిలాగే జీవిస్తుంది అన‌డానికి ఇంత‌క‌న్నా సాక్ష్యం అవ‌స‌రం లేదు. అస‌లు ప్ర‌పంచంలో ఎవ‌రికీ సాధ్యం కానివి కూడా క్వీన్ ఎలిజ‌బెత్ IIకు సాధ్య‌మ‌వుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే ఈ అంశాలు ఆమెకు మాత్ర‌మే ప‌రిమితం. ప్ర‌పంచంలో మ‌రెవ‌రూ ఈ సౌక‌ర్యాల‌ను అనుభ‌వించ‌లేరు. 

1. ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ అవ‌స‌రం లేదు. విన‌డానికి వింత‌గా ఉంది కానీ.. బ‌హుషా యూకేలోనే కాదు ప్ర‌పంచంలోనే ఎవ‌రికీ ఈ సౌక‌ర్యం లేక‌పోవ‌చ్చు. ఆమె కారుకు లైసెన్స్ ప్లేట్‌, నంబ‌ర్ ప్లేట్ కూడా అవ‌స‌రం లేదు.

2. క్వీన్ ఎలిజ‌బెత్ II కు సొంత పాస్‌పోర్ట్ కూడా అవ‌సరం లేదు. ఎందుకంటే యూకే పాస్‌పోర్ట్‌ల‌న్నీ ఆమె పేరు మీదే జారీ అవుతాయి. మిగిలిన రాజ‌కుటుంబీకుల‌కు ఈ సౌక‌ర్యం లేదు.

3. ఆమె రెండు బ‌ర్త్‌డేలు జ‌రుపుకుంటారు. ఆమె అస‌లు పుట్టిన‌రోజు ఏప్రిల్ 21 కాగా.. అధికారిక రాయ‌ల్ బ‌ర్త్‌డే మాత్రం జూన్ రెండో శ‌నివారం జ‌రుపుకుంటారు. 

4. ఆమెకు సొంతంగా ఒక ఏటీఎం మెషీన్ ఉంటుంది. బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ బ్యాంకుల్లో ఒక‌టైన కౌట్స్‌.. బ‌కింగ్‌హామ్ ప్యాలెస్ బేస్‌మెంట్‌లో ప్ర‌త్యేకంగా ఆమె కోసం మాత్ర‌మే ఒక ఏటీఎం మెషీన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ సౌక‌ర్యాన్ని ఆమెతోపాటు రాజ కుటుంబీకులు కూడా వాడుకోవ‌చ్చు.

5. థేమ్స్ న‌దిలో ఉన్న అన్ని హంస‌లు క్వీన్ ఎలిజ‌బెత్‌వే. 

6. బ్రిటిష్ జ‌లాల్లోని డాల్ఫిన్స్ అన్నీ కూడా ఆమెకే చెందుతాయి. ఈ రూల్ ఇప్ప‌టిది కాదు. 1324లో అప్ప‌టి కింగ్ ఎడ్వ‌ర్డ్ II నుంచీ ఇదే కొన‌సాగుతూ వ‌స్తోంది.

7. ఆమె అనుమ‌తి లేనిదే ఏ బిల్లూ చ‌ట్ట‌మ‌వ‌దు. యూకే పార్ల‌మెంట్‌లో పాస‌య్యే ప్ర‌తి బిల్లుకు రాణి ఆమోదం త‌ప్ప‌నిస‌రి. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో బిల్లు పాసైన త‌ర్వాత రాయ‌ల్ అసెంట్ కోసం అది ప్యాలెస్‌కు వెళ్తుంది.

8. ప‌న్నులు క‌ట్ట‌కుండా ఉండ‌వ‌చ్చు. ఆమెకు ఆ అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే 1992 నుంచి ఆమె స్వ‌చ్ఛందంగా ప‌న్నులు చెల్లిస్తున్నారు. 

10. ఆమె యూకేకే కాదు ఆస్ట్రేలియాకు కూడా రాణే. మొత్తం ఆస్ట్రేలియా ప్ర‌భుత్వాన్నే ర‌ద్దు చేసే అధికారం క్వీన్ చేతుల్లో ఉంటుంది. కొత్త ప్ర‌ధాన‌మంత్రి, కొత్త గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌ను కూడా నియ‌మించే అధికారం ఉంది. 

11. ఆమెను ఎప్పుడూ అరెస్ట్ చేయ‌కూడ‌దు. 

12. క్వీన్‌, రాజ‌కుటుంబీల‌కు సంబంధించిన ఎలాంటి స‌మాచారాన్ని కూడా ఫ్రీడ‌మ్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ కింద ఎవ‌రూ పొంద‌లేరు.