గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 16:13:11

ఇక్కడి దుకాణాల్లో రోబోలే వర్కర్లు..!

ఇక్కడి దుకాణాల్లో రోబోలే వర్కర్లు..!

టోక్యో: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దవాఖానల్లో రోబో సేవలను వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటిని హౌస్‌కీపింగ్‌, మీల్స్‌ సప్లై, మందులను అందించడంలాంటి పనులకు వాడుకున్నారు. పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు, భౌతిక దూరాన్ని పాటించాలని హెచ్చరించేందుకు వినియోగించుకున్నారు. అయితే, జపాన్‌ దేశంలో వర్కర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ వృద్ధుల జనాభా ఎక్కువ. దీంతో అక్కడి సూపర్‌మార్కెట్లు వర్కర్ల కొరతను అధిగమించేందుకు రోబోలను వాడుతున్నాయి.  

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, జపాన్ వృద్ధాప్య జనాభా కారణంగా తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది.  జనాభాలో దాదాపు మూడోవంతు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారే. దీంతో యువకార్మికులే కనిపించడం లేదు. ఈ కొరత తీర్చేందుకు ఫ్యామిలీమార్ట్ రోబోటిక్స్ సంస్థ ముందుకొచ్చింది. టెలిసిసిస్టెన్స్ తో భాగస్వామ్యం అయి మోడల్-టి రోబోట్‌ను సృష్టించింది.  ఈ ఆండ్రాయిడ్‌ రోబోను రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేయవచ్చు. ఈ రోబోలు కార్మికులు చేసే అన్ని పనులూ చేస్తున్నాయి. వస్తువులను ఎత్తడం, వాటిని ర్యాక్‌లలో సర్దడం, అవసరమున్న వస్తువును దగ్గరితీసుకురావడంలాంటి పనులు చేస్తున్నాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo