గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 14:00:39

అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేత.. సాధారణ జీవనం షురూ

అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేత.. సాధారణ జీవనం షురూ

ఖాట్మండు : నేపాల్‌లో బుధవారం నుంచి జనం తిరిగి సాధారణ జీవనం గడుపుతున్నారు. అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో బస్సులు నడువడంతో పాటు ఇతర కార్యకలాపాలన్నీ ప్రారంభమయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తిరిగి వారి పనులను కొనసాగిస్తున్నారు. నేపాల్‌ దేశం ఖాట్మండులో మొదటి కరోనా కేసు నమోదు కాగా మార్చి నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అక్కడ మొదట ఒక విద్యార్థికి కరోనా సోకింది. అతను చైనాలోని వూహాన్‌ నుంచి ఖాట్మండుకు తిరిగి రావడంతో ఇక్కడ మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసుల పెరుగుదల ప్రారంభమైనట్లు అధికార యంత్రాంగం తెలిపింది. 

దేశంలో 17000 మద్ద కరోనా కేసులు నిలిచిపోగా సుమారు 40 మంది ఇప్పటివరకు మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యల్ప కరోనా మరణాలు కలిగిన దేశంలో ఒకటిగా నేపాల్‌ నిలిచింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో పర్వతదేశమైన నేపాల్‌ వ్యాపార లావాదేవీలు కొనసాగించి ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. logo