శనివారం 06 జూన్ 2020
International - Apr 01, 2020 , 09:28:45

ఆ దేశాల్లో క‌రోనా లేదు

ఆ దేశాల్లో క‌రోనా లేదు

ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్‌ వ‌ణికిస్తోంది . ఇప్ప‌టికే  క‌రోనా కేసుల సంఖ్య‌ 8ల‌క్ష‌లు దాట‌గా...33వేల మందికి పైగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 199 దేశాల‌కు విస్త‌రించింది. అయితే ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకున్న‌ దేశాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశాల్లో పలావు ద్వీపం ఉన్న‌ది.  ఉత్త‌ర ప‌సిఫిక్‌లో 18వేల మంది జ‌నాభాతో ఉన్న ఈ ద్వీపంలోకి ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ ద్వీపానికి స‌మీప పొరుగు ప్రాంతాలు కేవ‌లం కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నాయి. అయినా కూడా వైర‌స్ ను రానివ్వ‌కుండా వీరు విధించుకున్న క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఇందుకు స‌హాయ‌ప‌డ్డాయి. ఇంకా వీటితో పాటు మైక్రోనేషియా, టోంగా, సోల‌మ‌న్, మార్ష‌ల్ దీవుల్లో కూడా కోవిడ్‌-19 విస్త‌రించ‌లేదు. వీరు అవ‌లంభించిన విధానాల‌తోటే క‌రోనాకు అడ్డుక‌ట్ట‌వేయ‌గ‌లిగారు.


logo