శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 10, 2020 , 17:47:48

అక్కడ రెండు రోజుల నుంచి కరోనా మరణాల్లేవ్‌

అక్కడ రెండు రోజుల నుంచి కరోనా మరణాల్లేవ్‌

ఎడిన్‌బర్గ్‌ : స్కాట్లాండ్‌ దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ కేసులు కూడా తగ్గుతుండడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా స్కాట్లాండ్‌లో వరుసగా రెండోరోజు కొత్త కరోనా మరణాలు నమోదు కాలేదని అధ్యక్షురాలు నికోలా స్టర్జన్ చెప్పారు.

కొవిడ్19 పాజిటివ్‌ రోగుల్లో స్కాట్లాండ్లో ఇప్పటివరకు మొత్తం 2,490మంది మరణించారు. ఈ సంఖ్యలో బుధవారం నుంచి మార్పు రాలేదు. అంటే కరోనా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదని అధికార యంత్రాంగం తెలియజేసింది. గడిజిన 24 గంటల్లో అక్కడ 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తమ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయని, త్వరలో కరోనా రహిత దేశంగా స్కాట్లాండ్‌ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నట్లు స్టర్జియన్‌ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo