మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 13:20:55

విటమిన్ డి లోపం వల్ల క‌రోనా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది!

విటమిన్ డి లోపం వల్ల క‌రోనా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది!

న్యూయార్క్ : విట‌మిన్ డి లోపం ఉన్న‌వారికి క‌రోనా వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని తాజా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. విటమిన్ డి అనేది హార్మోన్.. ఇది సూర్యరశ్మి ద్వారా చర్మంలో ఉత్పత్తి అవుతుంది. శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ మొత్తాన్ని నియంత్రించడంలో సాయ‌ప‌డుతుంది. ఇది ఎముకలు, దంతాలు, కండ‌రాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

"రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు విటమిన్ డి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి మందులు గతంలో వైరల్ శ్వాసకోశ అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తేలింది" అని యూఎస్‌లోని చికాగో విశ్వవిద్యాలయ ప్రధాన రచయిత డేవిడ్ మెల్ట్జర్ చెప్పారు. దీనిపై అధ్య‌య‌నం కోసం చికాగో పరిశోధనా బృందం క‌రోనా రోగులను ప‌రీక్షించిన‌ట్లు తెలిపింది. అందులో అత్య‌ధిక మంది విట‌మిన్ డి లోపంతో ఉన్నార‌ని తేలిన‌ట్లు పేర్కొన్న‌ది.

విటమిన్ డి లోపం ఉన్న రోగులను.. విటమిన్ తగినంత స్థాయిలో ఉన్న రోగులతో పోలిస్తే క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంద‌ని వారు క‌నుగొన్నారు. "సగం మంది అమెరికన్లు విటమిన్ డి లోపం కలిగి ఉన్నారు. ఆఫ్రికన్ అమెరికన్లు, హిస్పానిక్స్, చికాగో వంటి ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల్లో చాలా ఎక్కువ మంది ఈ విట‌మిన్ లోపంతో ఉన్నారు. ఇక్కడ శీతాకాలంలో తగినంత సూర్యరశ్మిని పొందడం కష్టం" అని పరిశోధకులు చెప్పుకొచ్చారు.

విటమిన్ డి చవకైనది. ఇది సాధారణంగా సూర్య‌ర‌శ్మి ద్వారా పొంద‌వ‌చ్చు. ఈ విటమిన్‌ స‌రిప‌డా ఉన్న‌వారికి క‌రోనా సోకే అవ‌కాశాలు తక్కువ అని పరిశోధనా బృందం చెప్పింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo