బైడెన్ టీంలో మరో ఇద్దరు భారతీయులు

వాషింగ్టన్ : అమెరికా ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ జోబైడెన్ తన టీంలో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్, స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా వినయ్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌ను వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాఘవన్ గతంలో ఒబామా వైట్‌హౌస్ బృందంలోనూ సేవలందించారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ టీమ్‌లోనూ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. వినయ్ రెడ్డి బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్‌గా పనిచేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్‌లో చోటు కల్పించారు. ఇందులో గతంలో ఒబామా టీమ్‌లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉండగా.. ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్, మేనేజ్మెంట్.. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్‌కు డైరెక్టర్ ఆఫ్ షెడ్యూలింగ్ అండ్ అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్‌తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్, ఎలిజబెత్ విల్‌కిన్స్‌ని చీఫ్ స్టాఫ్ సీనియర్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు.