శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Jan 08, 2020 , 11:33:18

వీడ్కోలులో విషాదం!

వీడ్కోలులో విషాదం!
  • సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట
  • ఇరాన్‌లో 56 మంది దుర్మరణం.. 200 మందికిపైగా గాయాలు
  • -అంత్యక్రియలు వాయిదా
  • -అమెరికా సైనికులు ఉగ్రవాదులు: ఇరాన్‌ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
  • -అమెరికాపై ప్రతీకారానికి 13 ప్రణాళికలు సిద్ధం!
  • -ఇరాన్‌ విదేశాంగ మంత్రికి అమెరికా వీసా నిరాకరణ

టెహ్రాన్‌: అమెరికా దాడిలో తమ అగ్రశ్రేణి కమాండర్‌ ఖాసిం సులేమానీ ప్రాణాలు కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఇరాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కెర్మన్‌ నగరంలో సులేమానీ అంతిమయాత్రకు జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో సులేమానీ అంత్యక్రియలను అధికారులు వాయిదా వేశారు. వాటిని ఎప్పుడు నిర్వహించనున్నారన్న దానిపై వివరాలు వెల్లడించలేదు. మరోవైపు, అన్ని అమెరికా బలగాలను ‘ఉగ్రవాదులు’గా పేర్కొంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించింది. అమెరికాపై ప్రతీకారానికి 13 ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటిలో అత్యంత బలహీనమైనది కూడా అగ్రరాజ్యానికి ‘చారిత్రక పీడకల’గా మారుతుందని ఇరాన్‌ అత్యున్నత భద్రతా మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జావీద్‌ జరీఫ్‌కి అమెరికా వీసాను నిరాకరించింది. గురువారం న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాల్లో జరీఫ్‌ పాల్గొనాల్సి ఉన్నది.


అమెరికా డ్రోన్‌ దాడిలో ప్రాణాలు కో ల్పోయిన ఇరాన్‌ అత్యున్నత కమాండర్‌ ఖా సిం సులేమానీ అంతిమయాత్రలో ఘోర విషా దం చోటుచేసుకుంది. సులేమాని స్వస్థలమైన కెర్మన్‌లో మంగళవారం జరిగిన అంతిమయాత్రకు లక్షల మంది తరలిరావడంతో.. తొక్కిస లాట జరిగి 56 మంది మరణించారు. సుమా రు 200 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధికారిక టీవీ చానెల్‌ తెలిపింది. దీంతో సులేమానీ అంత్యక్రియలను వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేదు. సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌లో డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Stampede2

ఆ ప్రాంతాలను బుగ్గిచేస్తాం..

కెర్మన్‌లోని సెంట్రల్‌ స్వేర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేత హసీన్‌ సలామీ మాట్లాడుతూ.. అమెరికా మద్దతునిస్తున్న ప్రాంతాలను బుగ్గి చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు ‘ఇజ్రాయెల్‌కు ఇక చావే’ అని నినదించారు. మరోవైపు, సులేమానీ మరణానికి ప్రతీకారం కోసం ఇరా న్‌ 13 ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇరాన్‌ అత్యున్నత భద్రతామండలి కార్యదర్శి అలీ షామ్‌ఖానీ పేర్కొన్నట్లు తాన్షిమ్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. గత వారం బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ మర ణించిన సంగతి తెలిసిందే.

వారంతా ఉగ్రవాదులే..

సులేమానీ హత్యకు తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్‌ మంగళవారం కీలక నిర్ణ యం తీసుకున్నది. అమెరికా దళాలను ‘ఉగ్రవాదులు’గా గుర్తిస్తూ ఇరాన్‌ పార్లమెంట్‌ ఒక బిల్లు ఆమోదించింది. అమెరికా భద్రతా బలగాలు, పెంటగాన్‌, దాని అనుబంధ సంస్థలు మొదలు సులేమానీ హత్యకు ఆదేశాలు జారీచేసిన వారంతా ఉగ్రవాదులేనని గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఖుద్స్‌ఫోర్స్‌కు 224 మిలియన్‌ డాలర్ల నిధుల కేటాయింపునకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

టైం లేదు.. వీసా ఇవ్వలేం!

ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావెద్‌ జరీఫ్‌కు అమెరికా వీసా నిరాకరించింది. న్యూ యార్క్‌ లో గురువారం జరిగే ఐరాస భద్రతా మండలి సమావేశాల్లో జరీఫ్‌ పాల్గొనాలి. 1947 ఒ ప్పందం ప్రకారం.. ఐరాస సమావేశాల్లో విదే శీ ప్రతినిధులు పాల్గొనేందుకు అమెరికా అనుమతించాలి. తనకు అమెరికా వీసా నిరాకరించారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్‌ సమాచారం ఇచ్చినట్లు జరీఫ్‌ చెప్పారు. ‘జరీఫ్‌కు వీసా జారీకి మాకు టైం లేదు.. అందుకే వీసా జారీ చేయడం లేదు’ అ ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపి యో.. గుటెరస్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు తమకు తెలిసిందన్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యం లో పశ్చిమాసియాలో నౌకలపై ఇరాన్‌ దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని, అప్రమ త్తంగా ఉండాలని తన మిత్ర దేశాలను అమెరికా హెచ్చరించింది.


logo