శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 11, 2020 , 10:20:28

అప్పుడు అనాథ శ‌వాలు.. ఇప్పుడు క‌రోనా మృతులు

అప్పుడు అనాథ శ‌వాలు.. ఇప్పుడు క‌రోనా మృతులు

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారి అమెరికాను క‌కావిక‌లం చేసింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతంగా అక్క‌డ క‌రోనా విజృంభిస్తున్న‌ది. పెద్దఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 18 వేలు దాటింది. ఇంకా రోజురోజుకు మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉంది. ఇక న్యూయార్క్ న‌గ‌రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికావ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, కేసుల్లో సగం న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక, వేల సంఖ్యలో మ‌ర‌ణాలు న‌మోద‌వుతుండ‌టంతో మృత‌దేహాలు కుప్ప‌ల్లా పేరుకుపోతున్నాయి. దీంతో అధికారులే ఎక్క‌డిక‌క్క‌డ‌ సామూహిక ఖననాలు చేస్తున్నారు. అందులో కొన్ని క‌రోనా మృత‌దేహాల‌కు 150 ఏండ్లుగా అనాథ శవాలను పూడ్చిపెట్టేందుకు ఉప‌యోగిస్తున్న హార్ట్ దీవిని వినియోగిస్తున్నారు. న్యూయార్క్‌లోని ఆ దీవిలో భారీ గుంతలు తీసి వాటిలో మృత‌దేహాల‌ను పూడుస్తున్నారు. 

హార్ట్ దీవిలో గతంలో సగటున వారానికి 25 మృతదేహాలను ఖననం చేసేవారట‌. ఇప్పుడు కరోనా మ‌హ‌మ్మారి ఆ సంఖ్యను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం అక్క‌డ రోజుకు 25 మందిని ఖననం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మృతదేహాలు ఇంకా వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని గుంతలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 


logo