(Antibiotics) 93 సంవత్సరాల క్రితం ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ ఆవిష్కృతమైంది. ఒక ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా యాంటీబయోటిక్స్ తయారై చికిత్స విధానాన్నే సమూలంగా మార్చేసింది.
1928 సెప్టెంబర్ 28 న స్కాటిష్ శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్‌లో పని చేస్తున్న సమయంలో, ఒక ఫంగస్‌ను గుర్తించాడు. ఆ ఫంగస్ మీద చేసిన పరిశోధనలే నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల చికిత్స విధానాన్ని మార్చింది. వాస్తవానికి, ఫ్లెమింగ్ చేసిన పరిశోధన నుంచి ప్రపంచానికి మొట్టమొదటి యాంటీబయాటిక్ ఔషధం పెన్సిలిన్ వచ్చింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆవిష్కరణ 20 వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
స్కాట్లాండ్లో 1881 ఆగస్టు 6 న జన్మించిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్.. 1906 లో సెయింట్ మేరీస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్కు వెళ్లాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1928 లో తిరిగి సెయింట్ మేరీస్ మెడికల్ స్కూల్‌కు వచ్చి ఇక్కడే పెన్సిలిన్‌ను కనుగొన్నాడు. ఫ్లెమింగ్ తన పరిశోధన కోసం ఒక పెట్రీ వంటకాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక రోజు అతను ఆ డిష్‌లో ఉన్న జెల్లీ.. ఫంగస్‌తో కప్పబడి ఉండటం గమనించాడు. ఈ ఫంగస్ ఎక్కడ ఉన్నా, అక్కడ అన్నిరకాల బ్యాక్టీరియా చంపబడుతుంది. పరిశోధనల అనంతరం దీనిని ఫంగస్ పెన్సిలియం నోటాటం అని గుర్తించారు. పెన్సిలిన్ ప్రపంచంలోనే మొదటి యాంటీబయాటిక్. మానవులకు కలిగే అనేక అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి వైద్యులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ యాంటీబయాటిక్ ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
2018 : శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
2016: ఇస్లామాబాద్‌లో సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్
2015: భారతదేశం తన మొదటి అంతరిక్ష పరిశీలనశాల, 6 ఉపగ్రహాల ప్రయోగం
2006: జపాన్ 90 వ ప్రధాన మంత్రిగా షింజో అబే ప్రమాణ స్వీకారం
2002: లక్నో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 14 మంది దుర్మరణం
2008 : అంతరిక్షంలోకి తొలి ప్రైవేట్ రాకెట్ స్పేస్ఎక్స్ ఫాల్కన్-1 ప్రయోగం
1929 : ప్రముఖ గాయని లతామంగేష్కర్ పుట్టినరోజు
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..