శనివారం 23 జనవరి 2021
International - Nov 28, 2020 , 13:56:48

కొలంబోలో ఇండియా, శ్రీలంక‌, మాల్దీవ్స్ త్రైపాక్షిక భేటీ

కొలంబోలో ఇండియా, శ్రీలంక‌, మాల్దీవ్స్ త్రైపాక్షిక భేటీ

కొలంబో: భార‌త్, శ్రీలంక‌, మాల్దీవులు దేశాల మ‌ధ్య ఈ ఉద‌యం త్రైపాక్షిక భేటీ ప్రారంభ‌మైంది. కొలంబోలో జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో భార‌త్ త‌ర‌ఫున జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌, మాల్దీవ్స్ త‌ర‌ఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మ‌రియా దీదీ, శ్రీలంక ర‌క్ష‌ణ‌శాఖ కార్య‌ద‌ర్శి క‌మ‌ల్ గుణ‌ర‌త్నే పాల్గొన్నారు. ఈ త్రైపాక్షిక సమావేశానికి శ్రీలంక విదేశాంగ ‌శాఖ మంత్రి దినేశ్ గుణ‌వ‌ర్ద‌నే చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు.  

శ్రీలంక‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు శ్రీలంక‌లోని హై క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ట్విట్టిర్‌లో ఒక ప్ర‌క‌ట‌న చేసింది. స‌ముద్ర భ‌ద్ర‌త విష‌యంలో మూడు దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర‌ సహ‌కారంపై చ‌ర్చించ‌డం కోసం ఈ త్రైపాక్షి స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు కొలంబోలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం తెలిపింది.  

  ‌


logo