బుధవారం 03 జూన్ 2020
International - Apr 24, 2020 , 18:03:00

మ‌ళ్లీ రెచ్చిపోయిన తాలిబ‌న్లు

మ‌ళ్లీ రెచ్చిపోయిన తాలిబ‌న్లు

 కాబూల్‌: క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ తాలిబ‌న్ల తీరు మార‌డం లేదు. ఇటీవలే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగినా.. మళ్లీ తాలిబన్లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ‌ ప్రభుత్వ సహకార దళానికి చెందిన 13 మందిని హతమార్చినట్లు ఆఫ్ఘన్ అధికారులు అనుమానిస్తున్నారు.బద్‌ఘిస్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామ శివారుల్లో ఉన్న ప్రభుత్వ సహకార దళానికి చెందిన ఓ ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు దాడికి తెగ‌బడ్డారు. దీంతో అక్క‌డ ఉన్న సిబ్బంది జాడ తెల్వ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీంతోనే తాలిబన్లు పక్కా స్కెచ్‌ వేసి దాడికి దిగారని.. అదృశ్యమైన వారంతా మరణించినట్లు తెలుస్తోందని  తెలిపారు. అయితే ఇటీవల పాక్‌ నుంచి కూడా తాలిబన్లకు అనుకూలంగా ఉగ్రవాదులు ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా ఆప్గ‌న్ వారిని అడ్డుకుంది.ఈ ఘటనలో పలువరు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను ఆప్ఘన్ దళాలు హతమార్చాయి. ఇదే సమయంలో పలువురు తాలిబన్‌ ఉగ్రవాదుల్ని కూడా మట్టుబెట్టారు. 


logo