శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 23:55:52

స్పెన్సర్ గ్రూప్ లో 950 మంది ఉద్యో గాలు ఊస్ట్

 స్పెన్సర్ గ్రూప్ లో 950 మంది ఉద్యో గాలు ఊస్ట్

లండన్: కరోనా  మహమ్మారి కారణంగా పలు రంగాలు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తుండగా,  మరి కొన్ని అదనపు వ్యయాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పుడు లండన్‌కు చెందిన మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ పీఎల్‌సీ కూడా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తం 950 మందికి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తున్నది. దుస్తులు, హోంవేర్ రిటైలర్ అయిన స్పెన్సర్ గ్రూప్ తమ మొత్తం ఉద్యోగులు 78 వేల మంది నుంచి 1.2 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.  


logo