మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 08:58:33

తల్లిని చూసి తల్లడిల్లిన కొడుకు

తల్లిని చూసి తల్లడిల్లిన కొడుకు

పాలస్తీనా : కొడుకు కళ్లముందే తల్లి నరకయాతన పడుతుంటే.. ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. కానీ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా నేను ఉన్నాను, నీకేం కాదు. అని ధైర్య చెప్పి తన తల్లిని బ్రతికించుకోవాలని ఉన్నా.. అతను ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆమెను కరోనా కబలించి వేస్తోంది.  దీంతో ఆసుపత్రికి వెళ్లి చూడలేని పరిస్థితి. ఏంచేయాలో తెలియక ప్రతి రోజు రాత్రి ఆసుపత్రిలోని గదికి ఉన్న కిటికీ ఎక్కి కూర్చొని తన తల్లిని చూసేవాడు.

ఆమె ప్రాణాలు వదిలే వరకు అలానే చూసుకున్నాడు. పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించి ఫొటోను ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత ప్రతినిధి మహ్మద్‌ సఫా ట్విటర్‌లో షేర్‌ చేశాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.logo