గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 19, 2020 , 02:28:15

ప్రపంచంలోని అతిపొట్టి వ్యక్తి మృతి..

 ప్రపంచంలోని అతిపొట్టి వ్యక్తి మృతి..

నేపాల్‌: ప్రపంచంలోనే అతిపొట్టి వ్యక్తిగా పేరుగాంచిన ఖాగేంద్ర థాపా మగర్‌ మరిణించాడు. గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన థాపా మగర్‌ గత కొద్ది కాలంగా న్యూమెనియాతో భాద పడుతున్నాడు. ఆయన మరణించిన విషయాన్ని గిన్నిస్‌ రికార్డు యాజమాన్యం ధృవీకరించింది. ఖాగేంద్ర 14 అక్టోబర్‌, 1992లో బాగ్‌లంగ్‌ జిల్లా, నేపాల్‌లో జన్మించాడు. రూప్‌ బహదూర్‌, ధన్‌మాయలకు ఖాగేంద్ర పెద్ద కుమారుడు. 2010లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఖాగేంద్ర గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.


కాగా, అతను 2011లో బాగా పాపులర్‌ అయ్యాడు. ఆ యేడాది ఖాగేంద్ర నేపాల్‌ టూరిజం గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. ఖాగేంద్రకు గిటార్‌ వాయించడమంటే చాలా ఇష్టం. అలాగే అతని సోదరులతో బైక్‌పై షికార్లు కొట్టేవాడని అతని తండ్రి రూప్‌ బహదూర్‌ ఆవేదనగా తెలిపాడు. logo
>>>>>>