శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 16:52:43

రాయి అనుకొని బ్యాగులో వేసుకున్నాడు.. తీరా చూస్తే డైమండ్‌!

రాయి అనుకొని బ్యాగులో వేసుకున్నాడు.. తీరా చూస్తే డైమండ్‌!

ఒక్కోసారి అదృష్టం వ‌ద్ద‌న్నా త‌లుపు తీసేవ‌ర‌కు కొడుతూనే ఉంటుంది. ఇత‌ని విష‌యంలో కూడా అలానే జ‌రిగింది. ఎంతోమంది వ‌జ్రాల కోసం వెతుకుతుంటే.. మంచి రాయి క‌నిపిస్తే చాలు అనుకునే ఇత‌ని కంట పడింది వ‌జ్రం. కోటీశ్వ‌రుడిని చేసింది. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ చోటు చేసుకున్న‌దో తెలుసా?  ఆర్కన్సాస్‌లోని మౌమెల్లేలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న కెవిన్ కినార్డ్‌కు చిన్నప్పటి నుంచి ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌’లో విహరించడం అలవాటు. ఒక‌ప్పుడు అక్క‌డ డైమండ్లు ఉండేవ‌ట‌. అందుక‌ని అక్క‌డ ఒక వ‌జ్రం అయినా దొర‌క్క‌పోదా అని పార్క్‌కు వెళ్లిన వారంతా వ‌జ్రాల కోసం గాలిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు పార్క్‌కి వెళ్లినా కెవిన్ మాత్రం అలా చేయ‌లేదు. ఇటీవ‌ల త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి కెవిన్ స్టేట్ పార్క్‌కు వెళ్లాడు. అక్క‌డున్న వారితోపాటు త‌న ఫ్రెండ్స్ కూడా రాళ్ల‌‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు.

కెవిన్‌కు మాత్రం ఒక‌రాయి షైనింగ్‌గా క‌నిపించ‌డంతో భ‌లే ఉందే రాయి అంటూ తీసుకున్నాడు. అలా త‌న‌కు న‌చ్చిన రాళ్ల‌ను ఇంటికి తీసుకెళ్ల‌డానికి బ్యాగులో వేసుకున్నాడు. అలా పార్క్ నుంచి సేక‌రించిన వాటిని డైమండ్ డిస్క‌వ‌రీ సెంట‌ర్ వ‌ద్ద రాళ్ల‌ను ప‌రీక్షిస్తారు. అందులో క‌నుక వజ్రాలు ఉన్న‌ట్లు గుర్తిస్తే వివ‌రాలు రాసుకొని సంద‌ర్శ‌కుల‌కు ఇచ్చేస్తారు. అంద‌రూ ఇస్తున్నారు క‌దా అని కెవిన్ కూడా త‌న వ‌ద్ద ఉన్న రాళ్ల‌కు టెస్ట్ చేయ‌డానికి ఇచ్చాడు. సంద‌ర్శ‌కులు ఆ రాయిని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. నిగ‌నిగ‌లాడే రాయి మామూలు రాయి కాదు, కోట్ల విలువ చేసే వ‌జ్రం. ఇది ఆ పార్క్ చ‌రిత్ర‌లోనే రెండో అతిపెద్ద వ‌జ్రం. 9.07 క్యారెట్ల బరువున్న ఆ వజ్రం విలువ కొన్ని కోట్లు ఉంటుంద‌ని చెప్ప‌డంతో కెవిన్‌తోపాటు త‌న స్నేహితులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది! లక్ అంటే కెవిన్‌దే. స‌ర‌దాగా పార్క్‌కి వెళ్లి కోట్లు సంపాదించాడు. 


logo