గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 02:34:26

కరోనాపై బ్రహ్మాస్త్రం.. విటమిన్‌ డీ

కరోనాపై బ్రహ్మాస్త్రం.. విటమిన్‌ డీ

మాడ్రిడ్‌: కొవిడ్‌-19 చికిత్సలో ‘విటమిన్‌-డీ’ కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్‌-డీ క్రియాశీల రూపంగా పేరున్న కాల్సిఫెడియోల్‌ లేదా 25-హైడ్రాక్సీ విటమిన్‌ డీని ఎక్కువ మోతాదులో తీసుకున్న కొవిడ్‌-19 రోగుల్లో పలువురు ఆ వ్యాధి నుంచి బయటపడ్డారని స్పెయిన్‌లోని రెయినా సోఫియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌ సోకి దవాఖానలో చేరిన 76 మంది రోగుల్లో 50 మందికి కాల్సిఫెడియోల్‌తో చికిత్స అందించగా.. 49 మంది కోలుకున్నారని, ఒక్కరికి మాత్రమే ఐసీయూ చికిత్స అవసరమైందని చెప్పారు. ఔషధాన్ని తీసుకోనివారిలో 13 మంది ఐసీయూలో చేరారని, మరో ఇద్దరు మరణించారని వెల్లడించారు. 


logo