గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 17:36:46

ఐస్‌గడ్డలపై బట్టలు లేకుండా రెండున్నర గంటలు.. ఆస్ట్రియా వ్యక్తి ప్రపంచ రికార్డు..!

ఐస్‌గడ్డలపై బట్టలు లేకుండా రెండున్నర గంటలు.. ఆస్ట్రియా వ్యక్తి ప్రపంచ రికార్డు..!

వియన్నా: కాస్త చలిపెడితేనే మనం తట్టుకోలేం. కానీ ఓ వ్యక్తి ఐస్‌గడ్డలపై బట్టలు లేకుండా రెండున్నర గంటలు ఉన్నాడు. అక్కడున్నవారంతా ఏం జరుగుతుంది అని ఊపిరిబిగపట్టుకుని చూశారు. కానీ అతడు విజయవంతంగా బయటకు వచ్చి తన రికార్డునే అధిగమించి, సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

ఈ కార్యక్రమం ఆస్ట్రియా దేశంలోని మెల్క్ అనే చిన్న పట్టణంలో జరిగింది. ఆస్ట్రియాకు ఐస్‌ స్విమ్మర్‌ జోసెఫ్ కోబెర్ల్ ఈ ఫీట్‌ చేశాడు. ఒక ఐస్‌బాక్స్‌లో సుమారు 2 గంటలు 30 నిమిషాలు ఉండిపోయాడు. అతడి ఒంటిపై బట్టలు కూడా లేవు. ఈ సాహస కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. అతడు రికార్డు సమయం తర్వాత విజయవంతంగా బయటకు రాగా, ఆ ప్రదేశం చప్పట్లతో మార్మోగింది. 

కాగా, మంచు వల్ల కలిగే నొప్పిని భరించేందుకు తాను సానుకూల ఆలోచనలు చేస్తున్నానని అతడు తెలిపాడు. బాక్స్‌ నుంచి బయటకిరాగానే తన వీపునకు సూర్యకిరణాలు తాకినప్పుడు కలిగిన అనుభూతిని వర్ణించలేనన్నారు. అతడు 2019లో నెలకొల్పిన రికార్డును, ఈ సారి  30 నిమిషాలు ఎక్కువసేపు కూర్చుండి తనే బద్దలుకొట్టాడు. భవిష్యత్తులోనూ ఇంకా ఎక్కువ సమయం మంచులో కూర్చుని ఫీట్‌ చేసేందుకు ప్రయత్నిస్తానని అతడు చెబుతున్నాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo