శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 16:48:13

మొదటి కక్ష్యా సవరణ పూర్తిచేసుకున్న చైనా మార్స్‌ ప్రోబ్‌

మొదటి కక్ష్యా సవరణ పూర్తిచేసుకున్న చైనా మార్స్‌ ప్రోబ్‌

బీజింగ్‌: అంగారకుడిపై పరిశోధనకు చైనా పంపిన మొట్ట మొదటి ప్రోబ్‌ తన మొదటి కక్ష్యా సవరణను విజయవంతంగా పూర్తిచేసుకుంది. తియాన్వెన్‌ -1 అనే ఈ ప్రోబ్‌ ఆదివారం ఉదయం 7 గంటలకు (బీజింగ్‌ టైం) మార్స్‌ కక్ష్యలో తిరిగేందుకు తనను తాను సర్దుబాటు చేసుకుందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. ఈ అంతరిక్ష నౌకలోని వ్యవస్థలన్నీ మంచి స్థితిలోను ఉన్నాయని పేర్కొంది. 

తొలిసారిగా అంగారకుడిపై పరిశోధనలకు చైనా వ్యోమనౌకను గత నెల 23న ప్రయోగించింది. ఈ నౌక ద్వారా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి మరో ఘనత సాధించింది. తియాన్వెన్‌-1 వ్యోమనౌకను అత్యంత శక్తిమంతమైన ‘లాంగ్‌ మార్చ్‌-5’ రాకెట్‌ ద్వారా హైనాన్‌ దీవిలోని వెంచాంగ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వ్యోమనౌక 36 నిమిషాల తర్వాత భూమి-అంగారకుడి బదిలీ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నౌక ఏడు నెలలు ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మార్స్‌ వద్దకు చేరుకోనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo