e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఆ విమానంలోనే మా వాళ్ల‌ను వెన‌క్కి తీసుకొస్తాం: ఆస్ట్రేలియా ప్ర‌ధాని

ఆ విమానంలోనే మా వాళ్ల‌ను వెన‌క్కి తీసుకొస్తాం: ఆస్ట్రేలియా ప్ర‌ధాని

ఆ విమానంలోనే మా వాళ్ల‌ను వెన‌క్కి తీసుకొస్తాం: ఆస్ట్రేలియా ప్ర‌ధాని

మెల్‌బోర్న్‌: ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఈ నెల 15 వ‌ర‌కూ నిషేధం విధించిన ఆస్ట్రేలియా.. ఇక త‌మ వాళ్ల‌ను వెన‌క్కి తీసుకొచ్చే ప‌నిలో ఉంది. శుక్ర‌వారం ఇండియాకు అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌రాల‌ను తీసుకెళ్లిన విమాన‌మే త‌మ వాళ్ల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్న‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని స్కాట్ మోరిస‌న్ వెల్ల‌డించారు. అయితే ఇండియాలో విమానం బ‌య‌లుదేరే ముందే ప్ర‌యాణికులు నెగ‌టివ్ ఆర్టీ-పీసీఆర్‌, నెగ‌టివ్ యాంటిజెన్ టెస్టుల రిపోర్టుల‌ను క‌చ్చితంగా ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కొన్నాళ్ల పాటు ఇండియా విమానాల‌పై నిషేధం విధించ‌డం వ‌ల్ల దేశంలోని క్వారంటైన్ కేంద్రాల‌పై ఒత్తిడిని త‌గ్గించంద‌ని, ఇక్క‌డ మూడో వేవ్ రాకుండా అడ్డుకోగ‌లిగామని మోరిస‌న్ చెప్పారు.

ఈ విమానం శ‌నివారం ఆస్ట్రేలియాలో ల్యాండ‌వ‌నున్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. తొలి విడ‌త‌గా 150 మంది ఆస్ట్రేలియా పౌరులు స్వ‌దేశానికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ దిగిన త‌ర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. సుమారు 9 వేల మంది ఆస్ట్రేలియా పౌరులు ఇండియాలో చిక్కుకుపోయారు. జూన్ చివ‌రికి నాటికి వెయ్యి మందిని తిరిగి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ విమానంలోనే మా వాళ్ల‌ను వెన‌క్కి తీసుకొస్తాం: ఆస్ట్రేలియా ప్ర‌ధాని

ట్రెండింగ్‌

Advertisement