ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 20:55:34

నిజంగా అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయి!

నిజంగా అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయి!

హైదరాబాద్‌: అబ్బా వాడికి భూమి మీద ఇంకా నూకలున్నాయ్ రా అందుకే అంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాడు అనే మాట మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఈ విషయం విన్నాక మనం కూడా అలా అనుకోక తప్పదు. ఎందుకంటే 90ఏళ్లు పైబడ్డాక ఓ వ్యక్తి పారాచూట్‌పై నుంచి కింద పడ్డాడు. అది కూడా ఓ నదిలో..  అయినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడట.  నమ్మశక్యంగా లేదు కదా. అయినా నమ్మక తప్పడం లేదు. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి..

ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల వ్యక్తి పారాచూట్‌లో షికారుకు వెళ్లాడు. అనుకోకుండా అది పాడై  సిడ్నీలోని ఓ బీచ్ లో కుప్పకూలింది. అసలే తొంభై ఏళ్లు పైబడ్డాయి. మామూలుగా అయితేనే.. అంత ఎత్తునుంచి కింద పడుతున్నామంటే గుండె ఆగిపోతుంది. అలాంటిది ఈ పెద్దాయన గాల్లోంచి మళ్లీ నదిలో పడ్డాడు. వర్రీవుడ్ అనే ప్రాంతంలో అతన్ని చూసిన స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పారాచూట్‌పై నుంచి నదిలో పడ్డప్పటికీ..  అతడి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు.. కానీ రాళ్లు తగలగా స్వల్ప గాయాలయ్యాయి. అతడిని కాపాడిన స్థానికులు ఎడమ కాలుకి కట్టు కట్టారు. తర్వాత వైద్యం కోసం అతడిని సిడ్నీలోని రాయల్ నార్త్ షోర్ దవాఖానకు పంపించి, నీటిలో పడ్డ పారాచూట్‌ను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.