గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 01:33:38

అమెరికాలో మృత్యుకేళి

అమెరికాలో మృత్యుకేళి

  • 50 వేలు దాటిన మరణాల సంఖ్య  

వాషింగ్టన్‌: కరోనా విలయంతో అమెరికా అల్లాడిపోతున్నది. గురువారం నుంచి శుక్రవారానికి 24 గంటల వ్యవధిలో 3,176 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా మృతులసంఖ్య 50,031కి చేరుకుంది. గత పది రోజుల్లో మృతుల సంఖ్య రెట్టింపైంది. దేశవ్యాప్త మరణాల్లో దాదాపు 40 శాతం న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదుకాగా, తర్వాతి స్థానాల్లో న్యూజెర్సీ, మిషిగాన్‌, మసాచుసెట్స్‌ ఉన్నాయి. ఇక అమెరికాలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 8.69 లక్షలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు అమెరికన్లే ఉన్నారు. మరోవైపు, కరోనా ప్రభావంతో అగ్రరాజ్యంలో నిరుద్యోగిత రేటు.. 1930లనాటి ఆర్థికమాంద్యం స్థాయికి చేరుకున్నది. ప్రతి ఆరుగురు అమెరికన్లలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ.. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 బిలియన్ల ప్యాకేజీ బిల్లుకు ఆమోదం తెలిపింది.


logo