బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 20:36:17

21ల‌క్ష‌ల‌కు చేరిన కరోనా బాధితుల సంఖ్య‌

21ల‌క్ష‌ల‌కు చేరిన కరోనా బాధితుల సంఖ్య‌

క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. ప్ర‌పంచ దేశాల‌కు మొత్తం విస్త‌రించిన  ఈ మ‌హ‌మ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 21ల‌క్ష‌లు దాటిపోయింది. ల‌క్షా 38వేల‌ మందికి పైగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. అత్య‌ధికంగా అమెరికాలో 6,46,300 కేసులు ఉండ‌గా 28, 640 మంది ప్రాణాలు కోల్పోయారు. త‌ర్వాతి స్థానంలో స్పెయిన్ 1,82,816 కేసులు, మ‌ర‌ణాలు 19,130, ఇట‌లీ 1,65, 155 కేసులు, మ‌ర‌ణాలు 21,645, ఫ్రాన్స్ 1,47,863 కేసులు, మ‌ర‌ణాలు17,167, జ‌ర్మ‌నీ 1,35,549కేసులు, మ‌ర‌ణాలు 3,850, బ్రిట‌న్ 1,03,093 కేసులు, మ‌ర‌ణాలు 13,729, చైనా 82,341 కేసులు, మ‌ర‌ణాలు 3,342, ఇరాన్ 77,995 కేసులు, మ‌ర‌ణాలు3,342, ట‌ర్కీ 69,392 కేసులు, మ‌ర‌ణాలు1,518 సంభ‌వించాయి.


logo