శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 10:02:57

22 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసుల సంఖ్య‌

 22 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసుల సంఖ్య‌

ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభ‌ణ కొనసాగుతూనే ఉంది. పలు దేశాల్లో హెచ్చుత‌గ్గులు మిన‌హా మ‌ర‌ణాలు, కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా లక్షా 54 వేల 145 మందిని క‌రోనా బ‌లితీసుకుంది.  మొత్తం పాజిటివ్ కేసులు 22 లక్షల 48 వేల 891కి చేరాయి. ఇక  అన్ని దేశాల్లోనూ మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాల్లో వైర‌స్ వ్యాప్తి మ‌రింత పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంలేదు. కొత్త కేసులు మరణాలు అన్ని దేశాల్లో మరింతగా పెరగడం కలవరపరుస్తోంది. 

ఇక  అమెరికాలో ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారుతుంది.   ఒక్క రోజులోనే 2,535 మంది మరణించగా.. కొత్తగా 32,165 మందికి వైరస్ సోకింది.  ఇప్పటివరకూ ఒక్క‌ అమెరికాలోనే 7 లక్షల 9వేల 735 మంది వైరస్ బారిన పడగా.. 37,154 మంది మరణించారు. కాగా మే 15 వరకూ ఇక్కడ లాక్‌డౌన్ కొనసాగనుంది. ఫ్రాన్స్‌లో ఒకే రోజు 761 మంది మృతి చెందగా.. కొత్తగా 1,909 కేసులు నమోదయ్యాయి.  లక్షా 47 వేల 960 కేసులు ఉండ‌గా.. మృతుల సంఖ్య 18,681కి చేరింది.

స్పెయిన్‌లో కరోనా ధాటికి ఒక్క రోజే 687 మంది మరణించగా కొత్తగా 5,891 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,839గా నమోదైంది. ఇటలీలో ఒకరోజు వ్యవధిలో 575 మంది ప్రాణాలు కోలప్పోయారు.  ఇప్పటివరూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 22,745కి చేరుకుంది. కొత్తగా మ‌రో 3,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 72 వేల 434 దాటింది. ఇక ఇరాన్‌, బ్రిట‌న్‌లోనూ అంత‌కంత‌కూ  కరోనా రోగులు పెరుగుతూనే ఉన్నారు.


logo