పాక్ జాతిపిత జిన్నా పేరిట 'జిన్'

పాకిస్తాన్ దేశం తమ దేశ జాతిపితగా మహమ్మద్ అలీ జిన్నాను గౌరవించుకుంటున్నది. అంతటి గొప్ప నాయకుడి పేరిట మద్యం వస్తుండటం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఓ నెటిజెన్ మహమ్మద్ అలీ జిన్నా పేరిట మద్యం ప్రియులకు అందుబాటులోకి వచ్చిన జిన్ బాటిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. మద్యం పేరును జిన్నా.. అప్‌గ్రేడెడ్ జిన్ అని ముద్రించారు. బాటిల్ వెనుక వైపున బాజాప్తా జిన్నాకు సంబంధించిన సమాచారాన్ని కొంత ముద్రించి.. ఆ వ్యక్తిని స్మరించుకుంటూ.. అని చెప్పుకొచ్చారు.
భారత్‌లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన జిన్నా.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పాకిస్తాన్ దేశం ఏర్పాటుచేయాలంటూ ఉద్యమం చేశారు. ఆయన పోరాటం కారణంగా పాకిస్తాన్ ఏర్పడినందున ఆయనను జాతిపితగా పాకిస్తానీయులు భావిస్తుంటారు. ఇస్లాంలో మద్యం సేవించడం మహాపాపం. అదేవిధంగా మద్యంను హరామ్‌గా భావిస్తుంటారు. అంత నిక్కచ్చిగా వ్యవహరించే ముస్లింలకు.. జిన్నా పేరిట జిన్ రావడం మింగుడుపడటం లేదు.
"మంచి స్కాచ్, విస్కీ, జిన్, పూల్బిలియర్డ్స్, సిగరెట్లు, పోర్క్సాస్ ఎంజాయ్ చేసిన జిన్నా.. దానిపై వచ్చిన వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించలేదు" అని లేబుల్‌పై రాశారు. దీనిపై పాకిస్తాన్ సోషల్‌మీడియాలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతిపిత జిన్నా పేరిట జిన్ను తేవడమేమిటని పలువురు ప్రశ్నించారు. సంతోషించాలో.. బాధపడాలో తెలియడంలేదని ఒక నెటిజెన్ వ్యాఖ్యానించగా.. దీన్ని జాతీయ పానీయంగా ప్రకటించాలని మరో నెటిజెన్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు