బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 02, 2020 , 17:33:18

అత్య‌ధిక మంది వీక్షించిన యూట్యూబ్ వీడియో ఇదే

అత్య‌ధిక మంది వీక్షించిన యూట్యూబ్  వీడియో ఇదే

యూట్యూబ్ ఛాన‌ల్స్ లో చేసే ప‌లు వీడియోలు, పాట‌లు చిన్నారుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత‌లా అంటే పిల్ల‌లు కొన్ని వీడియోల‌ను చూస్తూ అస‌లు తిండి తిన‌డం కూడా మానేస్తారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫేమ‌స్ అయిన 'బేబీ షార్క్' పాట కూడా అలాంటిదే.  ద‌క్షిణ కొరియా ప్రొడ్యూస్ చేసిన బేబీ షార్క్ వీడియో సాంగ్ ..కార్టూన్ తో పిల్ల‌ల బొమ్మ‌ల‌తో క్యాచీ అడిక్టివ్ మెలోడీగా సాగే వీడియో సాంగ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఈ పాట ఇంగ్లీష్ వెర్ష‌న్ కు సోమ‌వారం నాటికి పింగ్ ఫాంగ్‌ యూట్యూబ్ ఛాన‌ల్ లో 7 బిలియ‌న్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. ఈ పాటను మొద‌ట 2016 జూన్ లో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. సియోల్ కు చెందిన ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పింక్‌ఫాంగ్ రూపొందించిన అమెరిక‌న్ క్యాంప్ ఫైర్ సాంగ్ కు ఇది రీమిక్స్‌. యూట్యూబ్ సెన్సేష‌న్ లూయిస్ ఫోంకి, డాడీ యాంకీ రూపొందించిన‌ 'డెస్ప‌సీటో' మ్యూజిక్ వీడియోను బేబి షార్క్  అధిగ‌మించడం విశేషం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.