క్వీన్ ఎలిజబెత్‌కు వచ్చిన వెరైటీ గిఫ్ట్స్ ...!

లండన్ :ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన బహుమతులు అందిస్తుంటారు. అయితే పెద్ద పెద్ద సెలెబ్రెటీల విషయంలో గిఫ్ట్ ల ట్రెండ్ మరోలా ఉంటుంది. ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజిబెత్ -2 తన జీవిత కాలంలో ఎన్నోబహుమతులు అందుకున్నారు. వీటిలో కొన్ని చాలా వింతైనవి ఉన్నాయి. అటువంటివి ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. వాటిలో కొన్ని గిఫ్ట్‌లు ఇవన్నీ.1972లో ఆఫ్రికాలో ఉన్నకామెరూన్ దేశ ప్రభుత్వం క్వీన్‌కు ఆఫ్రికన్ ఏనుగును బహుమతిగా పంపించింది. దాన్ని క్వీన్ లండన్ జూకు ఇచ్చేశారు.
తన పెండ్లి రోజున అప్పటి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం అయిదువందల టిన్నుల్లో ఫైనాపిల్ ముక్కలు పెట్టి పంపించింది. వాటిని ప్రజలకు పంచేశారు.1991లో అమెరికా ప్రభుత్వం కౌబాయ్ బూట్లను బహుమతిగా పంపించింది. బ్రిటన్ పాలనలో సాగుతున్న వర్జిన్ ఐలాండ్ ప్రజలు ఓసారి క్వీన్‌కు అర కేజీ ఉప్పును బహుమతిగా పంపించారు. ఫిజీకి చెందిన ప్రజలు స్పెర్మ్ జాతికి చెందిన తిమింగలం పన్నును మెడలో వేసుకునే పెండెంట్‌లా చేసి పంపించారు. ఫిజీలో వీటిని రోట్ల మీదే అమ్ముతుంటారు. వేరే దేశాల నుంచి కూడా క్వీన్‌కు అనేక రకాల బహుమతులు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు