శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 10:59:22

రేపు మారిషస్‌ సుప్రీంకోర్టు భవనం ప్రారంభం

రేపు మారిషస్‌ సుప్రీంకోర్టు భవనం ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌ సాయంతో నిర్మించిన మారిషస్‌ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ జుగ్నౌత్‌తో కలిసి భారత ప్రధాని మోదీ గురువారం సంయుక్తంగా ప్రారంభించనున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరుగనుంది. మారిషస్‌ న్యాయమూర్తులతో పాటు ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు

ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్‌ 2016లో మారిషస్‌కు 353 బిలియన్‌ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ నిర్మించింది. అందులో భాగంగానే పోర్ట్‌లూయిస్‌లో సుప్రీంకోర్టు భవనాన్ని నిర్మించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo