గురువారం 04 జూన్ 2020
International - May 08, 2020 , 09:06:51

బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢాకా: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలోనూ మ‌సీదుల్లో ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ‌ దేశాలు క‌ఠిన చర్య‌లు అవ‌సంభిస్తుండ‌గా బంగ్లాదేశ్ మాత్రం సామూహికంగా నిర్వ‌హించే ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తివ్వ‌డం విశేషం. అయితే కొన్ని నిబంధ‌న‌ల‌తో ప్రార్థ‌న‌లు చేసేందుకు అన‌మ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. ఇందుకు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. చిన్న పిల్లలను, వృద్ధులను, జ్వరంతో బాధ పడుతున్న వారిని మసీదుల్లోకి తీసుకురాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 

 మసీదుల్లో శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రార్థనలకోసం వచ్చే వారు ఎవరి మ్యాట్ ను వారే తెచ్చుకోవాలని చెప్పింది. భౌతికదూరం పాటించాలని, మసీదుల పరిసరాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని ఆదేశించింది. మత సంస్థల నుంచి ఒత్తిళ్లు రావడంతోనే మసీదులు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంత‌వ‌ర‌కు వారు నిబంధ‌న‌లు పాటిస్తారో చూడాలి. గుంపులు,గుంపులుగా నిర్వహించే ఏ కార్యక్రమం ద్వారానైనా వైర‌స్ వ్యాప్తి వేగంగా విస్త‌రిస్త‌ద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.logo