మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 13:29:16

ఈ ఫొటోలోని మూడో వ్య‌క్తిని గుర్తించ‌గ‌ల‌రా? ఫోటో వైర‌ల్‌

ఈ ఫొటోలోని మూడో వ్య‌క్తిని గుర్తించ‌గ‌ల‌రా?  ఫోటో వైర‌ల్‌

ఎలోన్ రీవ్ మ‌స్క్ ప్ర‌ముఖ‌ టెస్లా సంస్థ స్థాప‌కుడు. లాక్‌డౌన్‌లో ఎలోన్ మ‌స్క్ పేరు బాగా వినిపించింది. దీనికి కార‌ణం అత‌ని కొడుకు నామ‌క‌ర‌ణమే.. ఎవ‌రికీ అర్థం కాని రీతిలో X Æ A-Xii అనిపేరు పెట్టారు. పైగా ఆ పేరును అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయ‌డానికి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బాగా వైర‌ల్ అయింది. ఇప్పుడు ఎలోన్ ఫోటో మ‌ళ్లీ వైర‌ల్ అవుతుంది.

ఎలోన్ బ్లాక్ టీ ష‌ర్ట్‌, ప్యాంట్ ధ‌రించ‌గా అత‌నితో పాటు కాన్యే వెస్ట్ కూడా ఉన్నారు. వీరిద్ద‌రు ఫోజ్ ఇచ్చిన ఫోటోను జూలై 1న ఎలోన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇంకొక వ్య‌క్తి ఉన్నారని ఇంట‌ర్నెట్ గ‌మ‌నించింది. ఎవ‌రో మీరు గుర్తుప‌ట్ట‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్న వేసింది. 'మీరు మీ అబ్బాయిల ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఇద్దరూ నారింజ రంగు ధరించినప్పుడు' అనే శీర్షిక‌ను కాన్యే జోడించి మ‌ర‌లా ఈ ఫోటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. కాన్యే చేసిన పోస్ట్‌కి విప‌రీతంగా రీట్వీట్లు వ‌చ్చాయి. ఇది 8 ల‌క్ష‌ల‌కు పైగానే లైక్స్ సంపాదించుకున్న‌ది. ఈ ఫోటోను బాగా జూమ్ చేసి మొత్తానికి మూడో వ్య‌క్తిని క‌నిపెట్టేశారు నెటిజ‌న్లు. ఆమె ఎవ‌రో కాదు ఎలోన్ మ‌స్క్ గ‌ర్ల్‌ఫ్రెండ్ గ్రిమ్స్‌. ఫోటో తీసేట‌ప్పుడు అద్దంలో ఆమె ప్ర‌తిబింబం క‌నిపించ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు అని ఒక నెటిజ‌న్ కామెంట్ పెట్టారు.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo