బుధవారం 27 మే 2020
International - Apr 15, 2020 , 18:54:02

పులి.. ఐదు పిల్ల‌లు.. హ్యాపీ ఫ్యామిలీ!

పులి.. ఐదు పిల్ల‌లు.. హ్యాపీ ఫ్యామిలీ!

వైల్డ్ ఫొటోగ్రాప‌ర్స్‌కు వ‌న్య‌ప్రాణులంటే మ‌హా ఇష్టం. వాటిని కెమెరాలో బందించేందుకు తెగ ఆరాట‌ప‌డుతుంటారు. ఈ లాక్‌డౌన్‌తో ట్రావెల్ ఫొటోగ్ర‌ఫీలంద‌రూ ఇంట్లోనే ఉండ‌డంతో బాధ‌ప‌డుతుంటారు. వ‌న్య‌ప్రాణుల కోసం ఆత్రుత‌గా ఎదురుచూసే వారంద‌రితోపాటు అందరికీ ఈ వీడియో ఖ‌చ్చితంగా ఉత్సాహాన్నిస్తుంది.

'ఒక ఆడపులి,  ఐదు పిల్లలను కలిగి  ఉంది. పులి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. మ‌ధ్య‌లో లేచి వెళ్తుంటే దాని వెంటే పులిపిల్ల‌లు కూడా బ‌య‌లుదేరుతున్నాయి. త‌ల్లితో ఆడుకుంటూ, సంతోషంగా ఉన్నాయి'. ఈ చిన్న హ్యాపీ ఫ్యామిలీని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన పర్వీన్ కస్వాన్ ఏప్రిల్ 14 న 53 సెకన్ల క్లిప్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది ఇప్పటివరకు దాదాపు 40,000 మంది వీక్షించారు. 3000 లైకులు, 1000 రీట్వీట్ల‌ను సంపాదించుకున్న‌ది. logo