గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 18, 2020 , 12:27:32

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఐదేండ్లు పట్టొచ్చు....

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఐదేండ్లు పట్టొచ్చు....

ఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కార్మెన్ రీన్‌హర్ట్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐదేండ్లు పడుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్, షట్ డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యలు ఇప్పుడు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం  కోలుకోవడానికి ఐదేండ్లు పట్టొచ్చని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించిందని, ఇది మరింతగా అసమానతలను పెంచుతుందని కార్మెన్ అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా ఆర్థికంగా ప్రభావితమవుతాయన్నారు. ఇరవై ఏండ్లలో మొదటిసారి ప్రపంచ పేదరికం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

 


logo