శనివారం 16 జనవరి 2021
International - Dec 14, 2020 , 17:25:24

కూతురి మురికి సాక్స్‌తో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌..ఫొటో వైరల్‌

కూతురి మురికి సాక్స్‌తో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌..ఫొటో వైరల్‌

న్యూయార్క్‌: సాక్స్‌ ఉతుక్కునేందుకు బద్ధకించిన కూతురుకు బుద్ధిచెప్పేందుకు ఓ తల్లి ఏంచేసిందో తెలుసా? ఆ సాక్స్‌తో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ఆ సాక్స్‌ను గోడ వద్ద ఉంచి, ఆ గోడకు ‘ది ఫర్‌గాటెన్‌ సాక్స్‌’ (మరిచిపోయిన సాక్స్‌) అని పేర్కొంటూ కూతురు పేరుతో ఓ కాగితాన్ని అంటించింది. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టింది. అంతే అప్పటినుంచి ఈ ఫొటో వైరల్‌ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ మంచిపనిచేశావ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

క్సెప్ క్యాంప్‌బెల్ అనే మహిళ తన కుమార్తెకు పరిశుభ్రత గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది. గది చుట్టూ చుట్టుముట్టిన మురికి సాక్స్‌తో విసిగిపోయిన క్యాంప్‌బెల్ ఓ సాక్స్‌తో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌మాదిరి ఏర్పాట్లు చేసింది. కాగా, ఈ పోస్ట్‌ చాలా వైరల్‌ అయ్యింది. కూతుళ్ల మురికిదుస్తులతో విసిగిపోయిన తల్లులందరూ ఈ పోస్ట్‌కు కామెంట్లు పెట్టారు.  ఈ ఫొటోలను చాలామంది షేర్‌కూడా చేశారు. పిల్లలకు బుద్ధిచెప్పేందుకు మంచిమార్గం ఎన్నుకున్నారంటూ కొందరు క్యాంప్‌బెల్‌ను ప్రశంసించారు కూడా.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.