గురువారం 04 జూన్ 2020
International - Apr 16, 2020 , 02:07:05

సూర్యుడి జ్వాలా చిత్రం

సూర్యుడి జ్వాలా చిత్రం

వాషింగ్టన్‌: సూర్కుని ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన ఛాయా చిత్రాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా తీశారు. దీంతో అయస్కాంత ప్లాస్మా థ్రెడ్స్‌కు (పోగుల వంటి ఆకృతులు) సంబంధించిన కొన్ని విషయాలు వెలుగుచూశాయి. సౌర తుఫానులు ఏర్పడే ప్రాంతంలో ఈ వలయాలు 500 కి. మీ. పరిధిలో విస్తరించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా సెంటర్‌లోని హై రెజల్యూషన్‌ కరోనల్‌ ఇమేజర్‌(హై-సీ) టెలిస్కోప్‌ సాయంతో ఈ ఆల్ట్రా హైడెఫినేషన్‌(హెచ్‌డీ-అత్యంత స్పష్టమైన) చిత్రాన్ని తీసినట్టు వెల్లడించారు. సూర్యుడి ఉపరితలంపై మిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో ప్రవహించే ప్లాస్మాలోని అయస్కాంత వలయాలకు సంబంధించిన విషయాల్ని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. సౌర వాతావరణంలోని బలమైన అయస్కాంత క్షేత్రం గురిం చి, ఆకాశంలో విచిత్ర కాంతులకు కారణమయ్యే సౌర తుఫానులపై అధ్యయనానికి కూడా ఈ చిత్రాలు సాయపడుతాయని అభిప్రాయపడ్డారు. 


logo