శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 19:03:28

జింక‌ను రోడ్డు దాటించిన డ్రైవ‌ర్‌.. ఇదే క‌దా మాన‌వ‌త్వం అంటే!

జింక‌ను రోడ్డు దాటించిన డ్రైవ‌ర్‌.. ఇదే క‌దా మాన‌వ‌త్వం అంటే!

కొన్ని ప్ర‌మాద సంఘ‌ట‌న‌లు జ‌రిగ‌ప్పుడు దాని గురించి ఒక్కొక్క‌రు ఒక్కోర‌కంగా అనుకుంటూ ఉంటారు. ఆ స‌మ‌యంలో నేనుంటే ఇలా చేసేవాడిని, అలా చేసి ఉండ‌కూడ‌దు అని లెక్చ‌ర్ ఇస్తుంటారు. కానీ త‌మ వంతు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం మ‌నుషులు అన్న విష‌యాన్నే మ‌ర్చిపోతారు. పాపం నోరులేని ఈ జింక రోడ్డు దాటేందుకు చాలాసేప‌టి నుంచి ప్ర‌య‌త్నిస్తుంది. మ‌ధ్య‌లో ప‌రిగెత్తితో యాక్సిడెంట్‌ అయే ప్ర‌మాదం ఉంద‌ని జీబ్రా క్రాసింగ్ ద‌గ్గ‌రే ఆగి ఉంది. కారులో వెళ్లేవాళ్లు జింక‌ను చూస్తూనే ఉన్నారు కానీ ఒక‌రు కూడా రోడ్డు దాటేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు.

అప్పుడే వ‌చ్చాడు మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తి. జింక‌ను చూసి కారు ఆపాడు. అది రోడ్డు దాటేంత‌వ‌ర‌కు ఆగి  త‌ర్వాత వెళ్లిపోయాడు. రోడ్డు ప్ర‌మాదాల గురించి వ‌న్య‌ప్రాణులు ఆలోచించినంత మాత్రాన మ‌నుషులు ఆలోచించ‌లేక‌పోతున్నారు. ఈ సంఘ‌టన ఎక్క‌డ జ‌రిగిందో ఏమో గాని అక్క‌డున్న సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయింది. మ‌నుషుల్లో ఇంకా మాన‌వ‌త్వం బ‌తికే ఉంద‌ని ఈ డ్రైవ‌ర్‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.