శనివారం 06 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:26:17

అమెరికాలో ఆగని మృత్యు ఘోష

అమెరికాలో ఆగని మృత్యు ఘోష

వాషింగ్ట‌న్: అమెరికాలో క‌రోనా మృత్యు ఘోష ఆగడం లేదు. ఒకరోజు కొంచెం మరణాలు తగ్గినట్లు అనిపించినా, ఆ తర్వాత రెండు రోజులూ మళ్లీ అమాంతం పెరిగిపోయాయి. గత ఇరవైనాలుగు గంటలలో అమెరికాలో 2,494 మంది మరణించిన‌ట్లు సమాచారం. దీంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 53,928కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 9,56,375గా నమోదైంది. ప్రపంచంలో నాలుగో వంతు కరోనా మరణాలు, మూడో వంతు కేసులు అక్కడే నమోదవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. logo