సోమవారం 01 జూన్ 2020
International - May 07, 2020 , 11:27:01

అమెరికాలో చైనా శాస్త్రవేత్త దారుణ హత్య

అమెరికాలో చైనా శాస్త్రవేత్త దారుణ హత్య

న్యూయార్క్‌: కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సైంటిస్ట్ అమెరికాలో దారుణ‌హ‌త్య‌కు గురైయ్యాడు. చైనాకు చెందిన బింగ్‌లియు పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసేవారు. పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన రాస్‌ టౌన్‌షిప్‌లోని తన నివాసంలో లియు  శవమై కనిపించారు. హో గు అనే వ్యక్తి ఆయన్ను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతదేహాన్ని కూడా వారు గుర్తించారు. కరోనా వైరస్‌ సోకినప్పుడు కణ స్థాయిలో చోటుచేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజ వేసిన సమయంలో లియు హత్యకు గురవడం గమనార్హం. కాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 


logo