ఆదివారం 07 జూన్ 2020
International - Apr 02, 2020 , 11:36:23

విజృంభిస్తున్న క‌రోనా..త‌ల్ల‌డిల్లుతున్న ప్ర‌పంచం

విజృంభిస్తున్న క‌రోనా..త‌ల్ల‌డిల్లుతున్న ప్ర‌పంచం

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ దేశాలు త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. అందరికీ కరోనానే. అందరిదీ అదే వ్యథనే. స్పెయిన్, ఇటలీ, అమెరికా.. దేశం ఏదైతేనేం మహమ్మారి బాధితులే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ రక్కసి బాధితులు ఇంచుమించు ప‌దిల‌క్ష‌ల‌కు చేరుకున్నారు. మ‌ర‌ణాలు 50వేల‌కు ద‌గ్గ‌ర‌య్యాయి. ఆస్పత్రి వార్డుల్లో ఎక్కడ చూసినా శవాలే.. రోగులే. ఇక ఇట‌లీలో 13,155 మంది మ‌ర‌ణించ‌గా, స్పెయిన్ తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీలో పరిస్థితి కాస్త కుదుట పడ్డా.. స్పెయిన్‌లో కరోనా స్వైర విహారం చేస్తోంది . అక్కడ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది.. మరణాల సంఖ్య 9 వేలు దాటింది. నిన్న ఒక్క రోజే 923 మంది మరణించారు. అమెరికాలో 1,049 మంది, ఇటలీలో 727 మంది కరోనాకు బలయ్యారు. యూకే 563, ఫ్రాన్స్ 509, జర్మనీ 156, ఇరాన్ 138, నెదర్లాండ్స్ 134, బెల్జియంలో 123 మరణాలు చోటుచేసుకున్నాయి.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..logo