సోమవారం 30 మార్చి 2020
International - Feb 28, 2020 , 01:08:08

ఉద్యోగం తొలిగించారని హత్యాకాండ!

ఉద్యోగం తొలిగించారని హత్యాకాండ!
  • అమెరికాలో ఐదుగురిని చంపిన దుండగుడు.. ఆపై ఆత్మహత్య

మిల్‌వాకీ(అమెరికా): అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. ఉద్యోగం నుంచి తొలిగించారన్న అక్కసుతో ఓ ఉద్యోగి ఉన్మాదిగా మారాడు. కంపెనీలో పనిచేస్తున్న తోటి ఉద్యోగి గుర్తింపు కార్డును దొంగిలించి సంస్థలోకి ప్రవేశించిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటన తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుని దుండగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్‌వాకీలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుండగుడు సంస్థ మాజీ ఉద్యోగి అని, ఘటనకు ముందు రోజే అతడిని ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించిందని పోలీసులు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడా? అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
logo