శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 15:45:05

తాను కూచున్న చెట్టును తానే నరుక్కున్నాడు..వీడియో వైరల్‌!

తాను కూచున్న చెట్టును తానే నరుక్కున్నాడు..వీడియో వైరల్‌!

హైదరాబాద్‌: ఎవరైనా తనంతట తాను అపాయంలో పడితే ఏం సామెత వాడుతామో గుర్తుందా? తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్నాడు. అని పెద్దలు అంటుంటారు. అచ్చం ఇలాంటి పనే చేశాడు ఒకతను. తను కూర్చున్న తాటి చెట్టు పైభాగాన్ని నరికాడు. గాల్లో చెట్టును పట్టుకుని ఫీట్‌ చేశాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

34 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వ్యక్తి మొదట తాటిచెట్టు ఎక్కాడు. రంపంతో దాని పైభాగాన్ని కట్‌చేశాడు. ఆ సమయంలో చెట్టు చాలావరకు కిందికి వంగింది. దానిపైభాగం తెగి కిందపడగానే కాండాన్ని పట్టుకుని అతడు పైకివెళ్లాడు. అది అలా చాలాసేపు గాల్లోనే అటూఇటూ కదులుతుండగా, అతడు గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియోను 4.2 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. అతడి ఫీట్‌ చూసి, అందరూ అవాక్కైపోతున్నారు. ‘ఎవరైనా నిజంగా పొడవైన తాటి చెట్టును కట్‌చేయడాన్ని ఎప్పుడైనా చూశారా? ఓహ్ మై గాడ్’ అనే శీర్షికతో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo