శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 21:10:20

చెత్త బ్యాగ్‌ విలువ రూ. 49.6 లక్షలు!

చెత్త బ్యాగ్‌ విలువ రూ. 49.6 లక్షలు!

లండన్‌: చెత్తబ్యాగ్‌ ఏంటి.. దాని విలువ రూ. 49.6 లక్షలు ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అవును మీరిన్నది నిజమే. కానీ ఇది పనికిరాని చెత్తతో నిండిన బ్యాగ్‌ కాదు. కాంస్యంతో తయారుచేసిన చెత్తబ్యాగ్‌ కళాఖండం. ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. చూసినవారంతా భలే ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివిన బ్రిటీష్ కళాకారుడు గావిన్ టర్క్ ఈ కళాకృతిని సృష్టించారు. కాంస్యం అనే లోహాన్ని కరిగించి చెత్తబ్యాగ్‌ ఆకృతికి ప్రాణం పోశాడు. దీన్ని ఫిలిప్స్ ఆక్షన్ హౌస్ టర్క్ వేలం వేస్తోంది. కాగా, రూ. 49.6 లక్షలు ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. ఇది బిన్ బ్యాగ్ ఆకారంలో అచ్చుపోసిన, నల్లగా పెయింట్ చేసిన కాంస్య ముద్ద. ఫేస్‌బుక్‌లో ఈ బిన్‌బ్యాగ్‌ కళాకృతులు వైరల్‌ అయ్యాయి. చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ‘చెత్తరూపంలో ఉన్న సంపద’ అంటూ సరదా కామెంట్లు చేశారు. 

I

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo