గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 24, 2020 , 01:27:45

ఆ డబ్బు నాకొద్దు

ఆ డబ్బు నాకొద్దు

  • లండన్‌ డబ్బు కేసులో ఎనిమిదో నిజాం నిర్ణయం

లండన్‌: దశాబ్దాలుగా సాగుతున్న బ్రిటన్‌లోని నిజాం నిధుల కేసు నుంచి వైదొలుగుతున్నట్టు హైదరాబాద్‌ ఎనిమిదో నిజాం ప్రిన్స్‌ ముకరంజా ప్రకటించారు. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఏడో నిజాం లండన్‌లోని ఓ బ్యాంకులో డబ్బు దాచగా, ఇప్పుడది 3.5 కోట్ల పౌండ్లకు (రూ.333 కోట్లకు) చేరింది. ఆ డబ్బు తమకే చెందాలని భారత ప్రభుత్వం, నిజాం వారసులతోపాటు పాకిస్థాన్‌ కూడా దీర్ఘకాలంగా కోర్టులో పోరాడుతున్నాయి. భారత ప్రభుత్వంతోపాటు నిజాం అసలు వారసుడైన ముకరంజాకే ఈ డబ్బు చెందుతుందని బ్రిటన్‌ హైకోర్టు 2019లో తీర్పు ఇవ్వగా, నిజాం ఇతర వారసులతోపాటు, పాకిస్థాన్‌ కూడా తీర్పును అప్పీల్‌ కోర్టులో సవాలుచేశాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ముకరంజా, భారత ప్రభుత్వం, ఏడో నిజాంకు చెందిన ఇంగ్లిష్‌ ఎస్టేట్‌ ట్రస్టు మధ్య నిధుల పంపిణీకి రహస్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నాలుగు లక్షల పౌండ్లు ఇంగ్లిష్‌ ఎస్టేట్‌ ట్రస్టుకు ఇవ్వాలి. ఈ ఒప్పందాన్ని నిజాం ఇతర వారసులు సవాలు చేయటంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముకరంజా.. జీవితకాలమంతా ఈ కేసులో పోరాడుతూనే ఉన్నానని, ఇక దీని నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఏడో నిజాం వారసులు ప్రస్తుతం 117మంది ఉన్నారు.


logo