ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 18:28:57

ప్ర‌ధాని మోదీకి థాంక్స్ చెప్పిన ఇవాంక ట్రంప్

ప్ర‌ధాని మోదీకి థాంక్స్ చెప్పిన ఇవాంక ట్రంప్

భారతదేశం మానవాళికి అందించిన యోగా ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్ననేప‌థ్యంలో అంద‌రూ కూడా క‌రోనా వైర‌స్ ద‌రిచేర‌కుండా ఎన్నో హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో.. 21 రోజుల స‌మ‌యంలో యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. తనకెప్పుడు ఖాళీ సమయం లభించినా యోగ నిద్ర ఆసనం వేస్తుంటానని.. ఇది ఒత్తిడిని తొలగిస్తుందని మోడీ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన త్రీడి వీడియోల‌ను కూడా ప్ర‌ధాని జ‌త చేశారు. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంక ట్రంప్ స్పందించారు. ప్ర‌ధాని సూచ‌న‌కు ఆమె థాంక్స్ చెప్పారు. యోగా ఒత్తిడిని జ‌యిస్తుంద‌ని పేర్కొన్నారు.logo