మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 14:44:21

పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నా సొంతంగా ఆహారం తీసుకున్నాడు!అదెలాగంటే..

పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నా సొంతంగా ఆహారం తీసుకున్నాడు!అదెలాగంటే..

న్యూయార్క్‌: పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అంటే శరీర అవయవ చలనంను ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్ర పడే కొద్ది వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది లాంటివి ఉంటాయి. ఆలోచించడం, ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి అధునాతన దశలలో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గడం సాధారణం అవుతుంది. కాలక్రమేణా పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అయితే, ఈ రుగ్మతతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి సొంతంగా ఆహారం తీసుకున్నాడు. ఇదంతా కొత్తగా పరిశోధకులు కనుగొన్న ఓ పరికరంవల్ల సాధ్యమైందట. కొత్త పరిశోధన ఫలితం  తన జీవితాన్ని మార్చివేసిందని అతడు ఆనందం వ్యక్తంచేస్తున్నాడు.

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, నాక్స్‌విల్లెకు చెందిన జస్టిన్ ఫీల్డ్స్ చిన్నప్పటినుంచి పార్కిన్సన్‌ రుగ్మతతో బాధపడుతున్నాడు.  2016 నుంచి దీనికి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల అతడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) చేయించుకున్నాడు. అది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. చికిత్స అతడి కదలికను మెరుగుపరచడమే కాక, గిన్నె నుంచి ఆహారాన్ని తనే తీసుకుని తినే సామర్థ్యాన్ని కూడా పునరుద్ధరించింది. మెదడుతో అనుసంధానించబడిన ఒక పరికరం ఆధారంగా అతడు గిన్నెలో సెరెల్స్‌ను చేతితో తింటుండగా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ఇది నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo