బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 23, 2020 , 11:27:55

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: సంపత్‌ పుల్కం

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: సంపత్‌ పుల్కం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలని ప్రముఖ ఎన్నారై సంపత్‌ పుల్కం తెలిపారు. తెలంగాణ ఎన్నారైల కోసం ప్రత్యేక పాలసీ తయారు చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలని ఆయన అన్నారు.

ఖతార్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలని ప్రముఖ ఎన్నారై సంపత్‌ పుల్కం తెలిపారు. తెలంగాణ ఎన్నారైల కోసం ప్రత్యేక పాలసీ తయారు చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారిని ప్రత్యేకంగా గుర్తించి, వారిని ప్రోత్సహించే విధంగా, దేశంలోనే అత్యుత్తమ పాలసీగా తెలంగాణ ఎన్నారై పాలసీ ఉండేలా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట జరిగిన ప్రవాస తెలంగాణవాసుల సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 100 కోట్లు కేటాయించి, తమ రాష్ట్రం నుంచి వెళ్లిన కార్మికులు విదేశాల్లో ఇబ్బంది పడకూడదని ఆయన ఈ నిధిని కేటాయించారు. 

ఇప్పటికే పలువురు కార్మికుల విన్నపాలు తెలుసుకొని, వారికి అండదండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ప్రకటించనున్న ఎన్నారై పాలసీపై కేసీఆర్‌ ప్రత్యేక ముద్ర ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. అన్ని వర్గాల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి గల్ఫ్‌ కార్మికులకు శుభవార్త అందించబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా, సంపత్‌ పుల్కం కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, రాములపల్లె గ్రామానికి చెందినవాడు. 


logo
>>>>>>