సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 14:55:24

కష్టపడి ఆన్‌లైన్‌ క్లాస్‌ చెబుతున్న టీచర్‌కు క్యూట్‌గా కృతజ్ఞతలు..!

కష్టపడి ఆన్‌లైన్‌ క్లాస్‌ చెబుతున్న టీచర్‌కు క్యూట్‌గా కృతజ్ఞతలు..!

ఢాకా: కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ ఆన్‌లైన్‌గా మారిపోయింది. టీచర్లు రకరకాల ప్రయోగాలు చేస్తూ క్లాస్‌లు చెబుతున్నారు. తాము ఎదురుగా లేకున్నా విద్యార్థులకు పాఠాలు అర్థం చేయించేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. విద్యా సంవత్సరం ఆగిపోకుండా వారు కష్టపడుతున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు చెప్పాలని యునిసెఫ్‌ భావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలతో వీడియో రూపొందించింది. ఓ బంగ్లాదేశ్‌ బాలుడు తన టీచర్‌కు క్యూట్‌గా కృతజ్ఞతలు చెప్పడం నెటిజన్లకు ఆకట్టుకుంది. ఈ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.  

బంగ్లాదేశ్‌కు చెందిన ఫర్జాద్ అనే 8 ఏళ్ల బాలుడు తన టీచర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోను యునిసెఫ్, బంగ్లాదేశ్‌ పోస్ట్‌చేసింది. ‘ఈ మహమ్మారి పరిస్థితిలో మాకు బోధించడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సాధ్యమేనని వారు మాకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు సహాయం చేసినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు, అని ఫర్జాద్‌ తెలిపాడు. ఈ వీడియోకు 119 రీట్వీట్లు రాగా, 528 మంది లైక్‌ చేశారు. 15,700 మంది వీక్షించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo