శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 26, 2020 , 16:46:55

ఈ బుడ్డోడి సంస్కారానికి నెటిజన్లు ఫిదా!

ఈ బుడ్డోడి సంస్కారానికి నెటిజన్లు ఫిదా!

హైదరాబాద్‌: మర్యాదపూర్వకంగా ఉండడం ఎప్పుడూ మనకు మంచే చేస్తుంది. కరుణ, ప్రేమ, దయాగుణాలను చిన్నప్పటినుంచే పిల్లలకు నేర్పిస్తే వారు పెద్దయ్యాక మానవతామూర్తులుగా మెదులుతారు. చిన్నప్పుడే గొప్ప సంస్కారం అలవర్చుకున్న ఓ బుడ్డోడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తన తల్లి నుంచి ఏ వస్తువు, ఆహార పదార్థం పొందిన వెంటనే అతడు ముద్దుముద్దుగా ‘థ్యాంక్యూ మామా’ అని చెబుతూ అందరి ప్రశంసలూ పొందుతున్నాడు. 

ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్‌ అవుతోంది. గ్రే అనే బాలుడు తన తల్లికి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వీడియోను పెద్ద సంఖ్యలో వీక్షించారు. బాలుడికి చిన్నప్పుడే పెద్దలకు అంత మర్యాద ఇచ్చే గుణం అలవడడం గొప్ప విషయమంటూ అందరూ అభినందిస్తున్నారు. మిగతా చిన్నారులకు ఈ వీడియో ప్రేరణగా నిలుస్తోంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.