సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 17:11:08

ఘనంగా నీటిగుర్రం పుట్టినరోజు.. దాని వయస్సు 55 ఏళ్లట!

ఘనంగా నీటిగుర్రం పుట్టినరోజు.. దాని వయస్సు 55 ఏళ్లట!

బ్యాంకాక్‌: హిప్పోపొటామస్‌.. నీటి గుర్రం వయస్సు 55 ఏళ్లు. జూకు వచ్చే ఎంతోమందికి అది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో జంతు ప్రదర్శనశాల అధికారులు దానికి కృతజ్ఞతగా బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. కేక్‌ ఆకారంలో ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయలు అందజేశారు. వినసొంపైన పాటల మధ్య చుట్టూ పెద్ద సంఖ్యలో జనం చేరి, సందడి చేశారు.   

ఈ అందమైన పుట్టినరోజు వేడుకకు థాయ్‌లాండ్‌లోని సి రాంచా జిల్లాలోని ఖావో నీవ్ ఓపెన్ జంతుప్రదర్శనశాల వేదికైంది. ఆ వృద్ధ హిప్పోపొటామస్‌ పేరు మే మాలి. దీనిని బ్యాంకాక్‌లోని డుసిట్ జూ నుంచి 2018 లో ఈ జూకు తరలించారు. దీనికి 21 మంది పిల్లలు. థాయిలాండ్ అంతటా జంతుప్రదర్శనశాలలలో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మే మాలి మరో పదేళ్లు బతికితే భూమి మీద అతి ఎక్కువకాలం బతికిన నీటిగుర్రంగా రికార్డు సాధించనుంది. కాగా, ఈ హిప్పోపొటామస్‌ జన్మదినవేడుకల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. చాలామంది దీనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo